కుసుమ ప్రాచీనమైన పంటలలో ఒకటి. అనాదిగా కుసుమ పంటను గింజల కొరకు, ఆహార పదార్ధాలకు రంగును రుచిని తెప్పించ డానికి, మందులలో వాడడానికి పెంచేవారు. ఇటీవలి కాలంలో ఈ పంటను ప్రధానంగా గింజలనుండి తీసే నూనె కోసం పెంచు తున్నారు. ఈ నూనె ఆరోగ్యపరంగా చాలా శ్రేష్ఠ మైనది. అంతే కాక ఈ కుసుమ పూరేకులు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి వివిధ రకాలుగా వినియోగించ బడుతున్నాయి. కాబట్టి కుసుమ పంట వేసుకుంటే రైతులు ఈ పూరేకుల అమ్మకం ద్వారా కూడా లాభం పొందవచ్చు. ఆకులు ఆకు కూరగా వాడుకోవచ్చు. ఇంకొక మంచి విషయం ఏమిటంటే కుసుమ పంట కరువును తట్టుకోగలదు. కుసుమ ఆకులు ముళ్ళు కలిగి ఉండడం వలన అడవి పందుల బెడద కొంత తక్కువగా ఉంటుంది. కాకపొతే ఈ ముళ్ళ వలన రైతులు ఈ పంటను పండించడానికి అంతగా ఇష్టపడరు. ఇటీవల కొన్ని ముళ్ళు లేని కుసుమ రకాలు కూడా అందుబాటులో కి వచ్చాయి. కుసుమ పంటకు వివిధ రకాల ఉపయోగాలు ఉండడం వలన, పెట్టుబడి ఎక్కువగా అవసరం లేనందున ఎక్కువ నికర లాభాన్ని పొందవచ్చు.
(Subject Expert Consulted : Dr. P. Padmavathi, Safflower Agronomist, DOR, Hyderabad)
- Login to post comments
- 3191 reads